వనం రాజేష్ నిజాయితీకి నిదర్శనం: అనకాపల్లిలో పెళ్లి బట్టలు, నగలు ఉన్న బ్యాగును తిరిగి అప్పగించిన ఆటో డ్రైవర్!

వనం రాజేష్ నిజాయితీకి నిదర్శనం: అనకాపల్లిలో పెళ్లి బట్టలు, నగలు ఉన్న బ్యాగును తిరిగి అప్పగించిన ఆటో డ్రైవర్!

15/April/2026 20:45    Share:   

అనకాపల్లి: నేటి సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని అనకాపల్లికి చెందిన ఒక ఆటో డ్రైవర్ నిరూపించారు. తన ఆటోలో ప్రయాణికులు మర్చిపోయిన విలువైన వస్తువులను ఏమాత్రం ఆశపడకుండా పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు
అనకాపల్లి గవరపాలేనికి చెందిన విషకోటి రజిని అనే మహిళ, తన బంధువుల పెళ్లికి సంబంధించిన కొత్త బట్టలు మరియు ఇతర విలువైన వస్తువులతో కూడిన బ్యాగును తీసుకుని అనకాపల్లి టౌన్ స్టేషన్ పరిధిలో ఆటో ఎక్కారు. అయితే, గమ్యస్థానం చేరుకున్న హడావుడిలో ఆ బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు గాంధీనగరం తలుపులమ్మ ఆటో యూనియన్‌కు చెందిన వనం రాజేష్ అనే ఆటో డ్రైవర్, తన ఆటోలో ఎవరో బ్యాగు వదిలేశారని గమనించారు. ఆ బ్యాగు తెరిచి చూడగా అందులో పెళ్లి బట్టలు మరియు విలువైన వస్తువులు ఉన్నాయి. వెంటనే రాజేష్ స్పందించి, ఆ బ్యాగును అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు పోలీసులు బాధితురాలు రజినికి సమాచారం అందించి, ఆమె సమక్షంలో బ్యాగును అందజేశారు. పోగొట్టుకున్న విలువైన వస్తువులు తిరిగి లభించడంతో రజిని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఆపద సమయంలో దేవుడిలా ఆదుకున్న ఆటో డ్రైవర్ రాజేష్‌ను పోలీసులు మరియు స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు. రాజేష్ చూపిన ఈ గొప్ప మనసు మరిందరికీ ఆదర్శమని కొనియాడారు.
Breaking News

Subscribe our Newsletter