పూడిమడక గ్రామంలో సర్వే నెంబర్లు 52, 53, 54, 55, 82,83 లో గల సుమారు 80 ఎకరాలు సిర్ జెడ్ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ భూమిలో అక్రమ లేఔట్ ,వంతెనలు నిర్మించి పూడిమడక గ్రామానికి ముప్పు తెచ్చే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు ఈ నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని అక్రమార్కులపై చర్యలు తీసుకొని పూడిమడక మత్స్యకారులకు జీవనాధారమైన ఉప్పుటేరును కాపాడాలని ఈరోజు అచ్చుతాపురం తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కి సిపిఎం వినతి పత్రం అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము, పూడి మడక శాఖ కార్యదర్శి చేపల తాతయ్య, సిపిఎం నాయకులు కె సోము నాయుడు, మత్స్యకారులు చౌడపల్లి పెంటయ్య, ఎరుపల్లి శ్రీను, మెరుగు కొర్లయ్య, పీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.