యలమంచిలి: మండలంలోని ఎంపియుపిఎస్ పి బయ్యవరం పాఠశాలలో జాతీయ సైన్స్ ఫెయిర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి.వి. ధనలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ శాస్త్రీయ అంశాలపై తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఆకర్షణీయమైన ప్రాజెక్టులను రూపొందించారు. విద్యార్థుల ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సృజనాత్మకత అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. సత్యనారాయణ, కె. వీరభద్రరావు, కన్యకుమారి, గౌతమి పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.