అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్యం ఎమ్మెల్యే బడేటి చంటి..
22/June/2026 19:57
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, అన్నివర్గాల ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. ఇదేక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సైతం ప్రత్యేక దృష్టిసారించినట్లు ఆయన వెల్లడించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన,,, తనను కలిసేందుకు విచ్చేసిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని నేనున్నానంటూ భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నియోజకవర్గంలో తిష్టవేసిన ప్రజా సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాలు చూపే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నానంటూ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...