అటవీ ప్రాంతంలో ప్రత్యేక నిఘా!!  డ్రోన్‌తో అక్రమాలపై దాడి..!!!

అటవీ ప్రాంతంలో ప్రత్యేక నిఘా!!  డ్రోన్‌తో అక్రమాలపై దాడి..!!!

02/April/2026 06:38    Share:   

క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి :
అనకాపల్లి జిల్లా యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపిన వివరాల మేరకు, యలమంచిలి గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక మరియు అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు హైటెక్ నిఘా చర్యలు చేపట్టారు.
ఈ చర్యల్లో భాగంగా కోటవురట్ల – మాకవరపాలెం సరిహద్దు ప్రాంతాలను కలుపుతూ ఉన్న పెద్దపల్లి అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా నిర్వహించారు.డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా అటవీ ప్రాంతంలో జరుగుతున్న అనుమానాస్పద కదలికలను గుర్తించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలను వెంటనే అదుపులోకి తీసుకునేలా చర్యలు చేపడుతున్నామని ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు.అటవీ ప్రాంతంలో ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
Breaking News

Subscribe our Newsletter