క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి :
దేశవ్యాప్తంగా గణన ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్వీయ గణన (Self Enumeration) విధానాన్ని ఈరోజు (ఏప్రిల్ 16) నుండి ప్రారంభించింది. ఈ ప్రక్రియ ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలను తామే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది.ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రత్యేక వెబ్‌సైట్
https://se.census.gov.in/ ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు ఈ స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతుంది.ఈ విధానం ద్వారా గణనలో పారదర్శకత పెరగడమే కాకుండా, సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు తమ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అయ్యి, OTP ద్వారా లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. నమోదు పూర్తయిన తరువాత వారికి ప్రత్యేక Self Enumeration ID అందజేయబడుతుంది.యలమంచిలి యం ఆర్వో, (MRO) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రతి కుటుంబం ఒక్కసారి మాత్రమే నమోదు చేయాలని, సరైన మరియు ఖచ్చితమైన వివరాలు ఇవ్వాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉండటంతో, ఇంటి వద్ద నుంచే సులభంగా పూర్తి చేసుకునే వీలుందని తెలిపారు.స్వీయ గణన ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితమైన డేటా లభించి, భవిష్యత్తులో సంక్షేమ పథకాల రూపకల్పనకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ప్రజలు చివరి తేదీకి ముందే తమ వివరాలను నమోదు చేసుకుని, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.