రాష్ట్ర మున్సిపల్ మహాసభలు జయప్రదం చేయండి   ఏఐటీయూసీ

రాష్ట్ర మున్సిపల్ మహాసభలు జయప్రదం చేయండి  ఏఐటీయూసీ

16/March/2026 07:22    Share:   

యలమంచిలి : రాజమండ్రిలో జరిగే 6వ రాష్ట్ర మున్సిపల్ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి గనిశెట్టి ఏసుదాస్ అన్నారు. ఆదివారం స్థానిక ఇంజనీరింగ్ వర్కర్స్ తో ఏసుదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభలు ఈనెల 16, 17, 18 తేదీలలో రాజమండ్రిలో జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన ఆర్థిక సరళీకరణ విధానాలను సర్వేయెగంగా అమలు చేస్తున్నాయని మున్సిపల్ రంగంలో ఔట్సోర్సింగ్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్యాలయ సిబ్బంది తదితరులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపు విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ మహాసభల్లో అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలపై నిర్దేశించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ యూనియన్ మెంబర్లు టి. సోంబాబు, పి.సూరిబాబు, టి. శ్రీనివాసరావు, వై. కన్నజ తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter