1వ తారీకు తప్పకుండా లబ్ధిదారులందరికీ పెన్షన్ , కూటమి ప్రభుత్వం లక్ష్యం .
02/April/2026 09:09
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు, తేదీ: 01-04-2026 ప్రతి నెల 1వ తారీకు తప్పకుండా లబ్ధిదారులందరికీ పెన్షన్ అందించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అందుకే గత 20 నెలలుగా క్రమం తప్పకుండా లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తున్నామని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు తెలియజేశారు. స్థానిక 38వ డివిజన్ నందు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి గారు. ఈ సందర్భంగా బడేటి చంటి గారు మాట్లాడుతూ ప్రతినెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలనేది ముఖ్య మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశమని అలాగే కూటమి ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం, అన్నా క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని అలాగే ప్రతి డివిజన్లో శానిటేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు గారు,EUDA చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ గారు, AMC చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి గారు, ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం గారు, ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు గారు,డివిజన్ ఇంచార్జ్ ఈతకోట శ్రీను గారు, డివిజన్ కో ఇంచార్జ్ శీలా దుర్గాప్రసాద్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ KVS చౌదరి గారు, స్థానిక నాయకులు పాలడుగు నాగమణి గారు, డొక్కు రవీంద్ర గారు, ఆండ్ర ఠాగూర్ గారు, బిజెపి నాయకులు నడపన భాస్కర్ రావు గారు, జనసేన నాయకులు వీరంకి పండుగ గారు, సరిది రాజేష్ గారు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు