ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత - ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్
23/March/2026 21:39
Share:
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత - ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు వెల్లడి కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు ప్రజల ఫిర్యాదు లను త్వరితగతిన, పారదర్శకమైన పద్ధతి లో పరిష్కరించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యంలో సోమవారం ప్రజా సమస్యల పరి ష్కార వేదిక' కార్య క్రమం నిర్వహించిన కార్యక్రమములో ఏలూ రు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీ ఎస్ గారు స్వయంగా బాధితుల నుండి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎన్. సూర్య చంద్ర రావు గారు పాల్గొని ఫిర్యాదుదారులతో మాట్లాడారు. ప్రజలు తమ సమ స్యల కోసం జిల్లా కార్యాల యం వరకు వచ్చి సమయం, డబ్బు వృథా చేసుకోకుండా ఈ క్రింది మార్గాలను ఉప యోగించుకోవాలని ఎస్పీ గారు సూచిం చారు. స్థానిక కార్యా లయాలు సబ్-డివిజన్, లేదా సర్కిల్ కార్యా లయాల్లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఆన్‌లైన్ ఫిర్యాదు meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్-ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చు. దూర ప్రాంతాల నుండి ఫిర్యాదుల కోసం పోలీస్ కార్యాల యానికి వచ్చిన సామా న్య ప్రజల సౌకర్యార్థం శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ వారు ఉచిత భోజన సదుపాయం కల్పించారు.