అనకాపల్లి రూరల్,భారీ గంజాయి పట్టివేత ఇద్దరు అరెస్టు ..!
30/May/2026 18:01
Share:
56.40 కిలోల గంజాయి స్వాధీనం, అనకాపల్లి, గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంపై అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ A. విభూషణ రావు గారి ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటల సమయం లో అనకాపల్లి మండలం బవులవాడ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో MH-05-FP-6439 నంబర్ గల మారుతి ఎర్టిగా కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, అందులోని వ్యక్తులు పారిపోవడానికి యత్నించారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో కారును తనిఖీ చేయగా, రెండు ప్లాస్టిక్ గోనె సంచుల్లో అక్రమంగా తరలిస్తున్న 56.40 కిలోల గంజాయి లభ్యమైంది. తూకం వేయగా ఒక సంచిలో 30.080 కిలోలు, మరొక సంచిలో 26.320 కిలోలు గంజాయి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అరెస్టు చేయబడిన నిందితులు: 1) రూపేష్ రాజు చిక్నే (34 సంవత్సరాలు), థానే జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం. 2) రాజు అంత్రు (37 సంవత్సరాలు), కోరాపుట్ జిల్లా, ఒడిశా రాష్ట్రం.
విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రం నుండి గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్ర రాష్ట్రానికి తరలించి అధిక ధరకు విక్రయించి అక్రమ లాభాలు పొందాలని యత్నించినట్లు అంగీకరించారు. పోలీసులు నిందితుల వద్ద నుండి 1) 56.40 కిలోల గంజాయి, 2) 4 మొబైల్ ఫోన్లు 3) MH-05-FP-6439 నంబర్ గల మారుతి ఎర్టిగా కారు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు Rs.28,20,000/- ఈ మేరకు సంబంధిత ఎన్.డి.పి.ఎస్. చట్టం కింద కేసు నమోదు చేసి అనకాపల్లి రూరల్ CI జి. అశోక్ కుమార్ గారు దర్యాప్తు కొనసాగించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరిగినది. ఈ గంజాయి రవాణా ముఠాకు సంబంధించిన ఇతర వ్యక్తుల వివరాలు సేకరించి తదుపరి చర్యలు చేపడుతున్నారు. అనకాపల్లి జిల్లా లో గంజాయి వినియోగం అక్రమ రవాణా కి సంబందించి నిఘా గురించి అనకాపల్లి జిల్లా ఎస్పి శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్ గారి ఆదేశాలు మేరకు, అనకాపల్లి సబ్ డివిజన్ పోలీస్ అదికారి అయిన అడిషనల్ ఎస్పి శ్రీమతి శ్రావణి గారి ఆద్వర్యంలో అనకాపల్లి జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా గంజాయి పై నిఘా పెంచడం లో బాగంగా ఈరోజు ఈ గంజాయిని పట్టుకోవడం జరిగింధి. అదేవిదంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు అనకాపల్లి జిల్లా పోలీసులు జిల్లా కట్టుబడి ఉన్నారని, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు గానీ, 1972 టోల్ ఫ్రీ నెంబర్ కి గానీ తెలియజేయాలని కోరుతున్నారు.