పంచదారల దళిత రైతులు,నోట్లో ఆకులు పెట్టుకుని వినూత్న నిరసన

పంచదారల దళిత రైతులు,నోట్లో ఆకులు పెట్టుకుని వినూత్న నిరసన

09/April/2026 20:30    Share:   

ఈరోజు రాంబిల్లి మండలం, పంచదారల గ్రామం, దళిత రైతులు 65వ రోజు నిరసన కార్యక్రమం సందర్భంగా, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల సిపిఎం నాయకులు రైతుల పోరాటానికి మద్దతు తెలిపి, నోట్లో ఆకులు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు, జి దేవుడు నాయుడు, కె సోము నాయుడు, సిహెచ్ శివాజీ లు మాట్లాడుతూ పేద రైతులకు, ముఖ్యంగా దళిత రైతులకు, 50 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి డి పట్టా భూములను, రైతుల కు ఇష్టం లేకుండా, బలవంతంగా, రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా భూములు తీసుకోవడానికి రెవెన్యూ అధికారులు ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇదే పంచదారల పంచాయతీలో, వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నప్పటికీ, ఆ భూములు తీసుకుని ఆర్ ఎండఆర్ రైతులకు ఇచ్చే అవకాశం ఉన్న, వాటి జోలికి వెళ్లకుండా, దళిత రైతులు, అనేక సంవత్సరాలుగా అన్ని హక్కులు పొంది, ప్రభుత్వ పరంగా రైతు భరోసా, తుఫాను కారణంగా నష్టపరిహారం, బ్యాంకుల్లో లోన్లు పొంది కుటుంబాలను పోషించుకుంటున్న దళిత రైతులు పొట్ట కొట్టడమా అభివృద్ధి అని సిపిఎం నాయకులు మండిపడ్డారు. పేదల భూములు లాక్కొని, ప్రైవేటు,కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టడమేనా అభివృద్ధిని విమర్శించారు. భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ జీవించే హక్కు ఉన్నప్పటికీ, ఈ సమాజంలో దళిత రైతులు తలెత్తుకుని గౌరవంగా బ్రతికే హక్కు లేదా అని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు దళిత రైతుల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు గుడబండి అప్పారావు, నాగఅప్పారావు, అబద్ధం, కనక రత్నం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter