హరిపాలెంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షికోత్సవం: భక్తిశ్రద్ధలతో విశేష పూజలు, అన్నసంతర్పణ

హరిపాలెంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షికోత్సవం: భక్తిశ్రద్ధలతో విశేష పూజలు, అన్నసంతర్పణ

19/July/2026 20:18    Share:   

హరిపాలెం:
హరిపాలెం అందాలపల్లి గ్రామంలో శ్రీశ్రీ వేంకటేశ్వర స్వామి 19వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో భాగంగా ఉదయం నుంచే ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది. స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు అత్యంత శ్రద్ధాభక్తులతో పూర్తి చేశారు.
మధ్యాహ్నం విచ్చేసిన భక్తులందరికీ భారీ ఎత్తున అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి వేళల్లో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి, పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ నగర సంకీర్తనలో భక్తులు వేలాదిగా పాల్గొని, గోవింద నామస్మరణలతో హరిపాలెం వీధులను మారుమోగించారు. భజనలు, కీర్తనలతో ఊరేగింపు కనులపండువగా సాగింది.
ఈ మొత్తం కార్యక్రమాన్ని శ్రీ శ్రీ వేంకటేశ్వర ఆధ్యాత్మిక సేవా సంఘం మరియు శ్రీ శ్రీ భగీరధి భజన మండలి సభ్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా పర్యవేక్షించి, విజయవంతం చేశారు. ఈ వేడుకలకు అందాలపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
 
 
 
Breaking News

Subscribe our Newsletter