ఏలూరు జిల్లాలో

ఏలూరు జిల్లాలో 'ధార్ గ్యాంగ్' కలకలం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా ఎస్పీ

16/June/2026 21:31    Share:   

ఏలూరు జిల్లాలో 'ధార్ గ్యాంగ్' కదలికలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారు జారీ చేసిన హెచ్చరిక

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాకు చెందిన ఒక ముఠా ఏలూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో, జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిశోర్, ఐపీఎస్ గారు ముందుగా  ప్రజలను అప్రమత్తం చేశారు.ప్రజలు ఎటువంటి ఆందోళన చెందకుండా, జాగ్రత్తగా ఉంటూ పోలీసులకు సహకరించాలని కోరారు.సదరు గ్యాంగ్ కదలికలపై జిల్లా పోలీసు యంత్రాంగం నిశితంగా విచారణ చేపట్టింది. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా గ్రామాలు లేదా కాలనీల్లో సంచరిస్తుంటే,వెంటనే గమనించాలని సూచించారు.
సదరు గ్యాంగ్ గురించి లేదా అనుమానాస్పద వ్యక్తుల గురించి ఎటువంటి సమాచారం తెలిసినా, ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయగలరు డయల్ 112 పోలీస్ కంట్రోల్ రూమ్ 8332959174 ప్రజల భద్రత దృష్ట్యా సోషల్ మీడియా ద్వారా కూడా ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గారు సూచించారు.
Breaking News

Subscribe our Newsletter