రాంబిల్లి మండలంలో రబీ పంటలపై రైతుల జాబితాలు ప్రదర్శన
10/March/2026 22:06
Share:
యలమంచిలి,రాంబిల్లి: మండలంలోని సామాజిక తనిఖీల్లో భాగంగా అన్ని రైతుసేవకేంద్రాలు, సచివాలయాలలో రబీ 2025-26 ఈ పంటలపై రైతుల జాబితాలు ప్రదర్శించడం జరిగింది మండల వ్యవసాయాధికారి సి సుమలత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ లోపు రైతులు తమ పేర్లను, భూమి వివరాలు, సాగు చేసే పంట, రకం మొదలైనవి పరిశీలించుకోవాలని అన్నారు. ఏమైనా దిద్దుబాట్లు కనిపిస్తే ఫిర్యాదు కోసం పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని, గ్రామసభ నిర్వహించిన తర్వాత ఈనెల 15వ తేదీ నాటికి తుది జాబితాను తయారు చేస్తామని తెలిపారు