హస్తకళాకారుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు రోహిణి ప్రత్యేక దృష్టి...!

హస్తకళాకారుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు రోహిణి ప్రత్యేక దృష్టి...!

14/June/2026 14:50    Share:   

ఏటికొప్పాక, (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏటికొప్పాక హస్తకళలకు మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి రోహిణి గారు ఏటికొప్పాక గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ సి.వి. రాజు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని హస్తకళాకారుల పరిస్థితులను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
హస్తకళ రంగం అభివృద్ధికి అవసరమైన చర్యలు, కళాకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలపై పద్మశ్రీ సి.వి. రాజు గారు ఆమెకు వివరించారు. కళాకారుల సంక్షేమం కోసం తమ వంతు కృషి కొనసాగుతుందని రోహిణి గారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుమారస్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు హస్తకళాకారులు పాల్గొన్నారు. హస్తకళల పరిరక్షణ, కళాకారుల అభ్యున్నతికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Breaking News

Subscribe our Newsletter