అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కమిటీ కార్యవర్గ  ప్రమాణ స్వీకారం

అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

05/February/2026 20:05    Share:   

అనకాపల్లి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కమిటీ కార్యవర్గ  ప్రమాణ స్వీకారం
సీనియర్ జర్నలిస్ట్ గంటా గోవింద్

అనకాపల్లి 04/02/2026 , స్థానిక రింగ్ రోడ్డులోని పెంటకోట కళ్యాణ మండపంలో జరిగిన అనకాపల్లి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కమిటీ కార్యవర్గ  ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఉత్తరాంధ్ర MLC, ప్రభుత్వ విప్ వేపాడ చీరంజీవి రావు గారు,మాజీ ఎంపీ పెద్దలు పప్పల చలపతి రావు గారు, మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ గారు.ఈ సందర్బంగా రెండొవ సారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన  బత్తుల తాతయ్య బాబు గారు , జిల్లా ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీ నాయుడు లు మరియు కార్యవర్గ సభ్యులు చేత వారు ప్రమాణ స్వీకారం చేయించారు.ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలార్పించారు.ఈ సందర్బంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter