ధరల పెరుగుదల అరికట్టాలి,సిపిఐ ప్రచార పాదయాత్ర..

ధరల పెరుగుదల అరికట్టాలి,సిపిఐ ప్రచార పాదయాత్ర..

06/August/2026 15:09    Share:   

ధరల పెరుగుదల అరికట్టాలి.. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులోకి తేవాలిఅనకాపల్లిలో సిపిఐ ప్రచార పాదయాత్ర

అనకాపల్లి: ప్రజలపై పెరుగుతున్న ధరల భారం తగ్గించి, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, సార్వత్రిక విద్య, వైద్యం ప్రతి పౌరుడికి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో గురువారం అనకాపల్లిలో ప్రచార పాదయాత్ర నిర్వహించారు.అనకాపల్లి నెహ్రూ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.అలాగే ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్య సేవలు ఉచితంగా లేదా అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ మరియు డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని అక్రమాలను పూర్తిగా నిర్మూలించాలని నినాదాలు చేశారు.పాదయాత్ర సందర్భంగా ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువజన విభాగ ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొండ
Breaking News

Subscribe our Newsletter