విజయనగరం,గరివిడి ZPTC అభ్యర్థిగా శ్రీమతి కిమిడి సంధ్య నామినేషన్ దాఖలు

విజయనగరం,గరివిడి ZPTC అభ్యర్థిగా శ్రీమతి కిమిడి సంధ్య నామినేషన్ దాఖలు

22/October/2026 20:04    Share:   

విజయనగరం: 

విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో గరివిడి మండల ZPTC అభ్యర్థిగా శ్రీమతి కిమిడి సంధ్య గారు తమ నామినేషన్ పత్రాలను ఘనంగా దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు, రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీ చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాసరావు), విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం శాసనసభ్యురాలు శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అనుభవంతో కూడిన పాలన, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సామాజిక సంక్షేమ ఆశయాలు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి వేగవంతమైన ప్రగతి విధానాలు నేడు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్-6’ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గ్రామానికి అందుతున్నాయని తెలిపారు. విజయనగరం జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి నాయకులందరూ అంకితభావంతో, ఒకే కుటుంబంలా సమన్వయంతో పనిచేస్తున్నారని కొనియాడారు.‘మన గ్రామం... మన ప్రజలు... మన అభివృద్ధి...’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, గరివిడి మండలంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థుల విజయంతో మండలంలో సంక్షేమ ఫలాలు మరింత వేగంగా అమలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ (ఎన్డీయే) కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter