పోలీసుల నైట్ విజిలెన్స్ రాత్రి రోడ్లపై ఆకతాయిలకు పోలీసుల చెక్
23/July/2026 15:44
Share:
#అకారణంగా తిరిగితే చర్యలు #ఆకతాయిలపై నిఘా #డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం #నగరంలో ప్రత్యేక తనిఖీలు #నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ఏలూరు నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఏలూరు వన్‌టౌన్ పోలీసులు అర్ధరాత్రి ప్రత్యేక గస్తీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌తో పాటు ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10 వేల వరకు జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు. అర్ధరాత్రి తర్వాత అకారణంగా రోడ్లపై తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, యువత అవసరం లేకుండా రాత్రివేళ సంచరించవద్దని సూచించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానస్పదంగా ఎవరైనా వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఇన్స్పెక్టర్ రామకృష్ణ.