బ్రాండ్ ఎక్స్ కార్మికురాలు సంధ్య మృతి

బ్రాండ్ ఎక్స్ కార్మికురాలు సంధ్య మృతి

31/July/2026 21:33    Share:   

బ్రాండిక్స్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సంధ్య మృతి.. యాజమాన్యం ఆదుకోవాలని సిఐటియు డిమాండ్
​విశాఖపట్నం / అనకాపల్లి:
బ్రాండిక్స్ పరిశ్రమ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొమ్మనాపల్లి సంధ్య (28) ఈరోజు ఉదయం కన్నుమూశారు.
​ప్రమాద వివరాలు:
​గత గురువారం బ్రాండిక్స్ పరిశ్రమలో 2వ షిఫ్ట్ విధులను ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా కార్మికులతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
​ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 13 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
​వారిలో తీవ్రగాయాలపాలై గత కొన్ని రోజులుగా కోమాలో ఉన్న కొమ్మనాపల్లి సంధ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం కిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు.
​కుటుంబ నేపథ్యం:
​మృతి చెందిన సంధ్యకు భర్త మరియు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆమె మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులో తల్లిని కోల్పోయి, ఆధారమైన వ్యక్తి దూరమవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.
​సిఐటియు నేతల డిమాండ్:
​ఈ దుర్ఘటనపై సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్. రాము మరియు మండల కన్వీనర్ కే. సోము నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంధ్య కుటుంబాన్ని బ్రాండిక్స్ యాజమాన్యం తక్షణమే స్పందించి భారీ ఎత్తున నష్టపరిహారం చెల్లించాలని, అలాగే ఆ కుటుంబంలోని పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉచిత విద్యతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతపై యాజమాన్యాలు నిర్లక్ష్యం వీడాలని హెచ్చరించారు.
Breaking News

Subscribe our Newsletter