ఎలమంచిలిలో వైభవంగా ‘అంగన్వాడీ ఉత్సవం’

ఎలమంచిలిలో వైభవంగా ‘అంగన్వాడీ ఉత్సవం’

01/October/2026 19:33    Share:   

హాజరైన AP RDC చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం (అక్టోబర్ 1, 2026) మధ్యాహ్నం ఎలమంచిలి టౌన్, తులసి నగర్‌లో ‘అంగన్‌వాడీ ఉత్సవం’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. పీలా రమా కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APRDC) చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి శ్రీ ప్రగడ నాగేశ్వరరావు, స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) శ్రీ సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు.

ఈ  ప్రగడ నాగేశ్వరావు మాట్లాడుతూ, సమాజంలో గర్భిణులు, బాలింతలు మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా మహిళలు, పిల్లల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ చిన్న పిల్లలకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ, వారి మానసిక, శారీరక వికాసానికి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో భాగంగా ఆకరిగా అంగన్వాడీ టీచర్స్ ని  సత్కరించారు.తులసి నగర్‌లో జరిగిన ఈ ఉత్సవంలో బిజెపి ఇన్చార్జ్ చిన్న రావు గారు, ఎలమంచిలి టౌన్ మున్సిపాలిటీ కమిషనర్, టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొర్ల శివ నారాయణమూర్తి (నానాజీ), జనసేన మరియు బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు, స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది, చిన్నారులు, మహిళలు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter