అనకాపల్లి:
అనకాపల్లి: ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తుమ్మపాల గ్రామ రోడ్డు, కొత్తూరు జంక్షన్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్‌ఐలు అర్జునరావు, సత్యనారాయణ పాల్గొని గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను వివరిస్తూ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి భద్రతా నియమాలను పాటించాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించి తమతోపాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని తెలిపారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొండ