మార్టూరు రామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు: పాల్గొన్న నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు

మార్టూరు రామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు: పాల్గొన్న నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు

29/March/2026 16:20    Share:   

అనకాపల్లి, ప్రకృతి న్యూస్:
అనకాపల్లి మండలం మార్టూరు గ్రామంలోని శ్రీ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో గ్రామ ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.ఈ వేడుకలకు నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి, ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రెవెన్యూ నాయుడు, పోతిని సాదు రావు, కమిటీ చైర్మన్ కరణం రామకృష్ణ, వైస్ చైర్మన్ డి. కిషోర్, దంట్ల సత్తిబాబు, అడ్వకేట్ కళావతి, దంట్ల నర్సింగరావు, కర్ణం అప్పల శ్రీను, కరణం నూక నాయుడు, పోల్నాటి నాగేశ్వరరావు దొడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.గ్రామస్తులందరూ సమష్టిగా పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయడంపై ఆలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. 
Breaking News

Subscribe our Newsletter