వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ మహాత్మునికి నివాళి ..

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ మహాత్మునికి నివాళి ..

02/October/2026 18:42    Share:   

ఎలమంచిలి 
పూజ్య బాపూజీ గాంధీ మహాత్ముని 157 వ జయంతి సందర్భంగా ఎలమంచిలి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలమంచిలి స్టేషన్ రోడ్ లో గల గాంధీ విగ్రహానికి అధ్యక్షుడు ఆడారి పూరి జగన్నాథం, ఉపాధ్యక్షుడు మడుగుల సూర్య సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథం మాట్లాడుతూ హింస మార్గాన్ని విడనాడి అహింస దోరణిలో ఉద్యమాన్ని నడిపి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీజీ ఎంతో కృషి చేశారని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఎలమంచిలి వర్తక సంఘం అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాసరావు ఆడారి చిన్న, తెలంగాణలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకర్ యాదవ్,ఏ సన్యాసి బాబు, ఎలమంచిలి అప్పారావు,  ఎలమంచిలి గ్రంథాలయ అధికారి వి.ఆనంద్ మరియు ఇతర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter