అనకాపల్లి, ఆగస్టు 15: దేశభక్తి, జాతీయ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచే 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ IAS గారు, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా IPS గారు, అనకాపల్లి ఆర్డీఓ కుమ్. షేక్ ఆయిషా గారు పాల్గొని దేశభక్తి, జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే వేడుకల్లో భాగస్వాములయ్యారు.
అనంతరం చిన్నారుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలను ముఖ్యఅతిథులు వీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు చిన్నారులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
క్రైమ్ అనాలసిస్ జిల్లా ఇంచార్జ్ అప్పికొండ శ్రీనివాస్