ఆగిరిపల్లి గ్రామంలో రూ 51 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం..

ఆగిరిపల్లి గ్రామంలో రూ 51 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం..

09/July/2026 19:21    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,

#రూ 3 కోట్లతో ఆగిరిపల్లి ఉన్నత పాఠశాల మోడల్ స్కూలుగా శ్రీకారం
#పట్టణాలు ధీటుగా గ్రామాలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
#రైతు బజార్లు ద్వారా రైతులకు మేలుచేసే కార్యక్రమాలు మరిన్ని అమలు చేస్తాము.
#ఆగిరిపల్లి గ్రామంలో రూ 51 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ...
ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలో గురువారం రూ 27 లక్షలు వ్యయంతో ఆర్&బి మెయిన్ రోడ్డు పక్కన నిర్మించనున్న డ్రైనేజీ పనులకు, మార్కెటు యార్డు ఆవరణలో రూ 24 లక్షలు వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్ దుకాణాలకు (షాపులు) రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసాథి భూమిపూజలు, శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్  రూ 3 కోట్లతో ఆగిరిపల్లి ఉన్నత పాఠశాల మోడల్ స్కూలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, విద్యాశాఖలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలిపారు. పట్టణాలు ధీటుగా గ్రామాలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.  వ్యవసాయ మార్కెట్ల ద్వారా రైతులకు మేలుచేసే కార్యక్రమాలు మరిన్ని అమలు చేస్తున్నామన్నారు. . గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామాల్లో మిగిలి ఉన్న పనులు దశలు వారీగా పూర్తి చేస్తామని తెలిపారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, పారుదల సమస్యలను అధిగమించేందుకు డ్రైనేజీ నిర్మాణం ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రైతు బజారులో నిర్మించనున్న నూతన షాపులు రైతులు, వ్యాపారులకు మరింత సౌకర్య వంతమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు స్థానిక వ్యవసాయ మార్కెటింగ్ సౌకర్యాల అభివృద్ధికి దోహద పడతాయని పేర్కొన్నారు.  రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించడంతో పాటు మెరుగైన మార్కెటింగు సౌకర్యాలు కల్పించడంపై  ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.  వినియోగ దారులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వలక్ష్యమని తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తిచేసి రైతులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.  ప్రజలకు నాణ్యమైన, తాజా కూరగాయలను సరసమైన ధరల్లో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతుబజార్లో దుకాణాల పనులను వేగవంతంగా పూర్తిచేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు. రైతుబజారులోని దుకాణాలు పూర్తయిన అనంతరం రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం లభిస్తుందని అన్నారు. దీనివల్ల మధ్యవర్తులు ప్రమేయం తగ్గి రైతులకు గిట్టుబాటు ధర, వినియోగ దారులకు తాజా కూరగాయలు తక్కువ ధరలకు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు.రైతు బజార్ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోపుగా పూర్తి చెయ్యాలని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు సంక్షేమం, వినియోగదారులు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైతు బజార్లను మరింత బలోపేతం చేసే చర్యలు కొనసాగుతాయని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు అధికారులు, ఏయంసి ఛైర్మన్ కుంపటి అరుణ, మార్కెటు యార్డు కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు, గ్రామస్తులు, తదితరులు  పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter