బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరం 

బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరం 

16/February/2026 11:37    Share:   

తేదీ 15. 02.2026 స్థానిక అనకాపల్లి పట్టణం బి డి కాలనీలో బ్రైడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల్యవివాహాలను ప్రోత్సహించడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ⁰ నివారణ ప్రోత్సహించే వారికి పడే శిక్షలు వంటి సమస్యలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమస్త కార్యదర్శి తాతపూడి జయశ్రీ మాట్లాడుతూ నేటి మన సమాజంలో బాల్య వివాహాలు ఇంకా జరుగుతున్నాయని వాటి వలన అనేకమైన సామాజిక ఆర్థిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వయోపరిమితి లేకుండా వివాహాలు చేయడం వలన వారికి సరైన శారీరిక అభివృద్ధి జరగకపోవడం వలన ఆడపిల్లలు గర్భం ధరించి మరణిస్తున్నారని అదేవిధంగా ప్రసవ సమయంలో శిశు మరణాలు కూడా జరుగుతున్నాయని ఆమె తెలిపారు వివాహం పట్ల సరైన అవగాహన లేకపోవడం వలన వివాహం జరిగిన కొంతకాలానికే విడిపోవడం కూడా జరుగుతుందని తద్వారా వారు పెడతోవ పడుతున్నారని దానివలన సమాజం ఆర్థికంగా సామాజికంగా నైతికంగా దిగజారిపోయే ప్రమాదం ఉంటుందని కావున తల్లితండ్రులు బాల్యవివాహాలను విడనాడి సరైన వయసు వచ్చేవరకు వివాహాలు చేయకూడదని అదే విధంగా సరైన ఉపాధి అవకాశాలు ఉన్నవో లేవో చూసి వాళ్ళ అమ్మాయిలకు వివాహాలు చేయాలని తద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెంది  ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు కావున ప్రతి ఒక్కరూ దీనిని సామాజిక బాధ్యతగా తీసుకొని ఇటువంటి వివాహాలు చేసే వారికి వాటి వలన వచ్చే సమస్యలను నివారించాలని అవసరమైతే ఆయా సంబంధిత అధికారులకు తెలియపరచి ఆ వివాహాలు ఆపడానికి ప్రయత్నం చేయాలని ఇటువంటి వివాహాలను ప్రోత్సహించే వారికి కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వాలు మరిన్ని చట్టాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు  ఈ కార్యక్రమంలో సమస్త అధ్యక్షులు కాళ్ళ శివశంకర్ ట్రెజర ర్ సిహెచ్ ప్రదీప్ కుమార్  పంచాయతీ ఉప సర్పంచ్ సత్యానందం మరియు స్థానిక ప్రజలు సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది
Breaking News

Subscribe our Newsletter