వైద్య సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం అవసరం: జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ పిలుపు

వైద్య సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం అవసరం: జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ పిలుపు

02/July/2026 09:41    Share:   

ఉమ్మడి జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీని, మర్యాదపూర్వకంగా కలిసి డిసిహెచ్ఎస్ డా.సి.హెచ్. బేబికమల పూలమొక్కను అందజేశారు ...
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఛాంబర్లో బుధవారం జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ని మర్యాద పూర్వకంగా కలిసి డిసిహెచ్ఎస్ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సి.హెచ్. బేబికమల పూలమొక్కను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ  జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేసి,మంచి ఫలితాలు సాధించాలన్నారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ వైద్యసేవలు పట్ల సంతృప్తి స్థాయిని మరింత పెంచాలని, నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు మరియు ఇతర వైద్యసంస్థల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా సమర్థవంతమైన సేవలు  అందించాలని అన్నారు. ముఖ్యంగా మాతా-శిశు ఆరోగ్యం, అత్యవసర వైద్యసేవలు, వ్యాధినివారణ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాలు అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అలాగే వైద్యసేవల్లో పారదర్శకత, జవాబు దారీతనం, సేవాభావం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగంతో సమన్వయంగా పనిచెయ్యాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter