మహానాడు వేదికపై ఏటికొప్పాక  టీడీపీ జోష్.. కార్యకర్తల సంద్రంతో దద్దరిల్లిన సభ..!

మహానాడు వేదికపై ఏటికొప్పాక టీడీపీ జోష్.. కార్యకర్తల సంద్రంతో దద్దరిల్లిన సభ..!

28/May/2026 19:29    Share:   

( క్రైo అనాలసిస్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )

అనకాపల్లి,ఏటికొప్పాక. 
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు రెండో రోజు కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రగడ నాగేశ్వరావు ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ విజయబాబు, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి నాయకత్వం ఏటికొప్పాక గ్రామం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు మహానాడుకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా పార్టీ జెండాలు, నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని మహానాడు వేదికను కదిలించారు. భజంత్రీల లక్ష్మి, సర్పంచ్ కుమారుడు శ్రీను, కర్రీ సింహాచలం, దేవరపు మోహన్, ఊడి రామకృష్ణ, వెంకటేష్, ఈశ్వరరావు, పోలిశెట్టి, అట్టా కాసులమ్మ, నాని, శెట్టి సత్తిబాబు, పోలు మూరు నాగేశ్వరావు, బాబాజీ, రమణ, బి.శ్రీను, బుజ్జి, కిషోర్, ఏసు, పి.శ్రీను, డి.రాజు, నాగేశ్వరరావు, కె.ప్రభాకర్ రావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహానాడు కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని, గ్రామ స్థాయి నుంచి పార్టీకి ప్రజల్లో అపారమైన ఆదరణ ఉందని నాయకులు తెలిపారు. ఎలమంచిలి నియోజకవర్గంలో టీడీపీకి ప్రజాభిమానముందని తెలుపారు,ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
Breaking News

Subscribe our Newsletter