పిల్లా రమా కుమారి ఆధ్వర్యంలో బీజేపీలో భారీ చేరికలు..!
26/March/2026 18:35
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్ ) యలమంచిలి : గురువారం యలమంచిలి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పిల్లా రమా కుమారి ఆధ్వర్యంలో భారీగా పార్టీ చేరికలు జరిగాయి. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమా కుమారి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరుతున్నామని కొత్తగా చేరిన వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఆడారి శ్రీధర్, బీజేపీ నాయకులు నక్కా శివశంకర్, టివియస్ ప్రకాష్, పప్పు ఈశ్వరరావు, పార్టీ అధ్యక్షులు బొద్దపు శివ, ఆసుపత్రి కమిటీ సభ్యులు పిట్టా దాసుబాబు, అత్తిలి నూకరాజు, ఆడారి భాస్కరరావు, కర్రి జానకిరామ్, యల్లపు శేషు తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.