రెడ్ క్రాస్ సంస్థ భవనంలో 2వ అంతస్తు నిర్మాణ పనులకు శంకుస్థాపన.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఎలూరు.
ఎలూరు, ఫిబ్రవరి లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ కి అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు
ఎలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఎలూరు రెడ్ క్రాస్ సంస్థ రెండవ అంతస్తు నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఎమ్యెల్యే బడే రాఘవకృష్ణయ్య (చంటి),
ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఎలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు.
అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఎలూరు విభాగం చైర్మన్ ఎంపినీశ్నీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో వారు పాల్గొన్నారు.
రోగులకు అవసరమైన రక్త సేకరణలో,ప్రకృతి విపత్తుల సమయంలో సంస్థ అందిస్తున్న సేవలను ఎంపీ తదితరులు ప్రశంసించారు.
ఈ సందర్భంగా తన తల్లి విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెడ్ క్రాస్ సంస్థకి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 2 లక్షల విరాళం అందించారు జరిగింది.