సత్వర పరిష్కారానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాలు అనకాపల్లి, ఫిబ్రవరి 23: అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు మొత్తం 60 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదుల వివరాలు:భూ తగాదాలు – 30, కుటుంబ కలహాలు – 5,ఇతర విభాగాలకు చెందినవి – 25ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా గారు సంబంధిత అధికారులను ఆదేశిస్తూ“ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలి. 7 రోజుల్లోపు విచారణ పూర్తిచేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చేపట్టిన చర్యల నివేదికలను జిల్లా పోలీసు కార్యాలయానికి తప్పనిసరిగా సమర్పించాలి,” అని స్పష్టం చేశారు. “ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత. ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో అనకాపల్లి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నారు,” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.