సబ్ జైలు ని సందర్శించిన న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షురాలు పి.విజయ
28/February/2026 06:57
Share:
యలమంచిలి పట్టణంలోని శుక్రవారం నాడు సబ్ జైలును మండల న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షురాలు అయిన పి.విజయ సబ్ జైలును సందర్శించి ముద్దాయులు యొక్క సమస్యలు ఖైదీలను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు, అలాగే ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాలంటే వారికీ ప్రభుత్వ వకీలను కేటాయించి బెయిలు పెట్టిస్తాం అని చెప్పారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, జైల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా చెప్పమని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపరిండెంట్ పి. సుబ్బారావు, ప్యానెల్ లాయర్ బి.హరి, శంకర్ రావు, జైలు సిబ్బంది, న్యాయ సిబ్బంది పాల్గొన్నారు.