ముడిసరుకు కొరతతో భారీగా పెరగనున్న మందుల ధరలు – సామాన్యుడిపై అదనపు భారం !

ముడిసరుకు కొరతతో భారీగా పెరగనున్న మందుల ధరలు – సామాన్యుడిపై అదనపు భారం !

12/April/2026 06:50    Share:   

రిపోర్ట్: క్రైమ్ అనాల్సిస్ టీవీఎస్ ప్రకాష్
హైదరాబాద్:
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ మేఘాలు భారతీయ ఔషధ రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో, మందుల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాల (API) ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ముడి పదార్థాల ధరలు సుమారు 200% నుంచి 300% వరకు పెరిగాయి ఈ పరిణామాల నేపథ్యంలో, ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడానికి మందుల రిటైల్ ధరలను గరిష్ఠంగా 180% వరకు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది
ధరలు పెరగనున్న ప్రధాన ఔషధాలు:
పారాసెటమాల్: జ్వరం మరియు ఒంటి నొప్పుల నివారణకు వాడే మందులు.
పెయిన్ కిల్లర్స్: అత్యవసర నొప్పి నివారణ మందులు.
యాంటీ బయాటిక్స్: వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నియంత్రణకు వాడే కీలక ఔషధాలు.
బీపీ మందులు: రక్తపోటు నియంత్రణ కోసం నిత్యం వాడే టాబ్లెట్లు
సాధారణ ప్రజలు ప్రతిరోజూ వాడే ఈ మందుల ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్యుడిపై కోలుకోలేని ఆర్థిక భారం పడనుంది. నిత్యావసర ఔషధాల ధరల పెరుగుదల పట్ల సామాన్య ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Breaking News

Subscribe our Newsletter