ఏలూరు సిటీ వైడ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ డి. పెదబాబు ఆధ్వర్యంలో ఏలూరు విజయలక్ష్మి థియేటర్ లో ఘనంగా రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు.. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు.. ఏలూరు, #:- సామాజిక స్పృహతో మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు అన్నారు.. మెగా స్టార్ చిరంజీవి గారి తనయుడు, సినీ నటులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఏలూరు సిటీ వైడ్ రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ డి.పెదబాబు , మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో విజయలక్ష్మీ థియేటర్ వద్ద శుక్రవారం రాత్రి కేక్ కట్ కటింగ్ విజయలక్ష్మీ థియేటర్ స్టాఫ్ కు మరియు నిరుపేదలకు చిరు గిఫ్ట్ లు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ మగధీర, రంగస్థలం వంటి సినిమాల్లో తనదైన నటనతో అలరించారని, చిరంజీవి తనయుడిగా సినీ అరంగేట్రం చేసిన రామ్ చరణ్ సమాజ సేవ చేసేలా ప్రతి సినిమాలో ఓ మేసేజ్ ఇస్తూ వస్తున్నారు. అలాగే ఏలూరులో మెగా ఫ్యామిలీ అభిమానులు నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వారు సేవా కార్యక్రమాలకు మారుపేరుగా నిలుస్తున్నారని, మెగా అభిమానులు ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఇంతటి మంచి కార్యక్రమం లో తనను కూడా భాగస్వామ్యం చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తేజ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, నలుగురికి సేవా చేస్తూ తన తండ్రి చిరంజీవి గారికి గొప్ప పేరు తీసుకొస్తూ ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు పి.జగన్, సురేష్ మాష్టారు, ఈ. పవన్ , శానం శ్రీ రామకృష్ణ మూర్తి, నరేష్, కట్టా ఆది, కోమాకుల శ్రీను(పూల శ్రీను), దోసపర్తి రాజు, పండు నాయుడు, దేవా బత్తుల అరవింద్, రామిశెట్టి కళ్యాణ్, ఫణి తుంపాల, మోజేష్, రోహిత్, వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు..