ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా 13 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. అనంతరం ఏలూరు నగరంలో ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల 3000 మంది జనసేన శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ.. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు, మార్చి 14:- ఏలూరు నియోజకవర్గం లో 13 వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు గారు , రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్, దెందులూరు ఇంచార్జీ శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి గార్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల సమక్షంలో జనసేన పతాక ఆవిష్కరణ చేసి వేడుకగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఎన్నో అవరోధాలు, అవమానాలు, వైరి వర్గాల అవహేళనలు, దశాబ్ద కాలానికి పైగా ఎదురొచ్చిన కష్టాలను అధిగమించి కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన జనసేన పార్టీ నిర్వహిస్తున్న 13 వ ఆవిర్భావ దినోత్సవం విజయోత్సవ సంబరాన్ని సంతరించుకుంటుందన్నారు.. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం సంకల్పించుకుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలే మాకు శిరోధార్యం అని వారు తెలిపారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల జనసైనికులను, జనసేన శ్రేణులను మమేకం చేస్తున్నామన్నారు. జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నాయకులు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున జనసైనికులకు, వీర మహిళలకు , జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. 2014లో ఈ రాష్ట్రంలో మన దేశంలోని రాజకీయాల్లో ఒక పెను మార్పు తీసుకు రావాలనే ఆలోచనతో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీకి కష్టపడ్డారని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాజకీయంలో పెను మార్పు జరగాలని,పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం సిద్ధాంతాల కోసం పనిచేయాలని కార్యకర్తలను సూచించారు. భావితరాల బంగారు భవిష్యత్తుకై ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని పోరాడుతున్న అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ యొక్క ఉన్నత ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో పలు పెను మార్పులు తీసుకు రానున్నారని తెలిపారు. దశ దిశ నిర్మించి ఆయన మరింత ఉన్నతంగా ఎదగాలని మేమంతా కోరుతున్నామన్నారు. అనంతరం ఏలూరు , దెందులూరు నియోజకవర్గాల జనసేన శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ ఏలూరు జనసేన కార్యాలయం వద్ద ప్రారంభమై పవర్ పేట, రమామహల్ సెంటర్ మీదుగా, ఫైర్ స్టేషన్, జూట్ మిల్లు ఓవర్ బ్రిడ్జి మీదుగా పాత బస్టాండ్ వంతెన, గడియారపు స్తంభం సెంటర్ మీదుగా కస్తూరిబా స్కూల్ వద్ద ఉన్న మర్చంట్ ఛాంబర్ కళ్యాణ మండపం వరకు సాగింది.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, నగర గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు మేడిచర్ల కృష్ణ, జాలిపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు చైర్మన్ మోటేపల్లి పవన్ హరిశ్చంద్ర కుమార్, దెందులూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పసుపులేటి భార్గవ్, దెందులూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి తాతపూడి చందు, సీతంపేట నీటి సంఘం అధ్యక్షులు మేడేపల్లి రామమోహనరావు,వి జయరాయి,పోతునూరు గ్రామాల జనసేన పార్టీ అధ్యక్షులు జల్లి తేజ, చదరం విద్యాసాయి, పైడిచింతపాడు జనసేన నాయకులు మోరు సుబ్బారావు, విజయరాయి ప్రచార కార్యదర్శి గుణ్ణం బాలు,అంకన్నగూడెం జనసేన నాయకులు మొరవనేని వంశీ, కాట్లంపూడి జనసేన నాయకులు కోన రవి కిషోర్,తోళం కిషోర్ కుమార్ ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, మరియు వివిధ హోదాల్లో ఉన్న ఏలూరు దెందులూరు నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, భారీ సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు..