పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి.. ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు
20/April/2026 07:30
Share:
పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు.. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు,ఏప్రిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా అందరీ ఆరాధ్య నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది. ఆయన త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు గారు ఆకాంక్షించారు.. ఈ సందర్భంగా ఏలూరు పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అప్పలనాయుడు మాట్లాడుతూ నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ప్రజా సేవకులు మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. అహర్నిశలు ప్రజల పక్షాన నిలబడే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరం. ఆయన సంకల్ప బలం, పోరాట పటిమ ముందు ఎలాంటి అనారోగ్యమైనా తలవంచాల్సిందే అన్నారు.. శస్త్రచికిత్స నుండి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, మునుపటి కన్నా రెట్టింపు ఉత్సాహంతో, నూతనోత్తేజంతో తిరిగి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాలని కోట్లాది మంది అభిమానులు, జనసైనికులు మరియు ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు.. ఆ వేంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ శ్రీరామ రక్షగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నామన్నారు.. ఈ కార్యక్రమం లో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, కమ్మ కార్పోరేషన్ చైర్మన్ కావూరి వాణిశ్రీ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, ఎట్రించి ధర్మేద్ర, బుధ్ధా నాగేశ్వరావు, కూనిశెట్టి మురళి కృష్ణ, కీర్తి కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు..