యలమచిలిలో నీటి కష్టాలు: మూడు నెలలుగా రాని మంచినీరు..

యలమచిలిలో నీటి కష్టాలు: మూడు నెలలుగా రాని మంచినీరు..

22/June/2026 08:33    Share:   

యలమచిలిలో నీటి కష్టాలు: మూడు నెలలుగా రాని మంచినీరు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల తీవ్ర ఆగ్రహం!
యలమచిలి:
యలమచిలి పట్టణంలోని రంగా వారి వీధిలో గత మూడు నెలలుగా మంచినీటి కులాయిలు రాకపోవడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోందని, ముఖ్యంగా గృహిణులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం:
ఈ సమస్యపై స్థానిక ప్రజలు, మహిళలు పలుమార్లు మున్సిపల్ అధికారులకు, సంబంధిత సిబ్బందికి మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం శూన్యంగా మారింది. "అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారే తప్ప, ప్రజల కనీస అవసరాలైన తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదు" అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం మరియు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తక్షణమే చర్యలు చేపట్టాలి:
పాలకుల, అధికారుల నిర్లక్ష్యం వల్లనే తాము ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే రంగంలోకి దిగాలి. రంగా వారి వీధిలో పాడైపోయిన మంచినీటి కొళాయిలను, పైప్‌లైన్లను యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేయించి, తాగునీరు సరఫరా చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ఖాళీ కుండలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

 
Breaking News

Subscribe our Newsletter