యలమంచిలి, ఏప్రిల్ 14 (క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్): యలమంచిలి స్థానిక శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో 8 ప్రముఖ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా, మొత్తం 78 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 33 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు టాటా ఎలక్ట్రానిక్స్ – 7 మంది,పాక్స్‌కాన్ – 11 మంది,అపోలో టైర్స్ – 6 మంది,డెక్కన్ కెమికల్స్ – 1 వ్యక్తి,డిక్సన్ కంపెనీ – 8 మంది, ఎంపికైన అభ్యర్థులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్ అభినందనలు తెలియజేశారు.కళాశాల జేకేసీ మరియు మేజిక్ బస్ సౌజన్యంతో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో జేకేసీ కోఆర్డినేటర్ కె. వెంకన్న, మెంటార్ మార్టిన్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.