వాత్సల్య పోర్టల్ ద్వారా మాత్రమే దత్తతకు దరఖాస్తు చేసుకోవాలి-
28/May/2026 19:57
Share:
దత్తత తీసుకునే విధివిధానాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి కలెక్టర్ శ్రీమతి వెట్రీ సెల్వి కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, దత్తత తీసుకునే విధివిధానాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరు జిల్లా నుండి శిశు గృహాలో ఆశ్రయం పొందుతున్న నాలుగు సంవత్సరాలు వయసు కలిగిన గోపాల్ అనే బాలుడిని అన్నమయ్య జిల్లాకు చెందిన తల్లిదండ్రులు దత్తత తీసుకోవడం జరిగినది. వారి ధ్రువీకరణ పత్రాలు, దత్తత తీసుకున్న బాబు వారితో అటాచ్ అయిన అనుబంధాల గురించి వివరంగా పరిశీలించి అన్ని సర్దుబాటు అయినవనీ కన్ఫర్మ్ చేసుకుని వారికి తుది దత్తత ఉత్తర్వులను బుధవారం ఏలూరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చేతుల మీదుగా అందించారు. దత్తత కొరకు మిషన్ వాత్సల్య పోర్టల్ ద్వారా మాత్రమే అప్లై చేసుకుని ఏ రకమైన దత్తత కైనా భారత ప్రభుత్వం నిర్దేశించిన దత్తత విధివిధానాల ప్రకారము పొందాలన్నారు. మధ్యవర్తుల ద్వారా కానీ డబ్బులు సమర్పించుకోనీ పిల్లల్ని తీసుకుంటే వారందరూ చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడిన వారు అవుతారన్నారు. , వారిని చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది.దత్తత తీసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మిషన్ వాత్సల్య పోర్టల్ లో దత్తత కొరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి పి శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ సూర్యచక్రవేణి , శిశు గృహ మేనేజర్ భార్గవి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొనారు.