APRS CAT, JC & DC ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి ముఖ్య ప్రకటన విడుదల.
25/April/2026 07:46
Share:
క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్ : అనకాపల్లి జిల్లా విద్యా శాఖ వారు అందించిన సమాచారం మేరకు 5వ, 6వ, 7వ తరగతుల ప్రవేశ పరీక్షలు మరియు ఇంటర్, డిగ్రీ ప్రవేశ పరీక్షల కోసం నిర్వహించబడిన APRS CAT, JC & DC పరీక్షల ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించగా, మొత్తం 1406 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 1125 మంది పరీక్ష రాశారు.అదేవిధంగా APR JC & DC CET పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడింది. ఈ పరీక్షకు మొత్తం 2195 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, మంచి హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు.ఈ పరీక్షలు అనకాపల్లి జిల్లాలో 6 పరీక్షా కేంద్రాలలో ఉదయం మరియు 10 పరీక్షా కేంద్రాలలో మధ్యాహ్నం సెషన్లలో నిర్వహించబడ్డాయి.పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించబడినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని కేంద్రాలలో అవసరమైన సదుపాయాలు కల్పించబడినట్లు వెల్లడించారు.