సైకిల్‌పై అయ్యప్ప భక్తుల శబరిమల యాత్ర..

సైకిల్‌పై అయ్యప్ప భక్తుల శబరిమల యాత్ర..

07/November/2026 18:55    Share:   

​యలమంచిలి :
పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తులు ఈశ్వర్, రాములు శుక్రవారం సైకిళ్లపై శబరిమల యాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ​స్థానిక వీరభద్రస్వామి ఆలయ పీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. శ్రీ అయ్యప్ప స్వామివారి దివ్యానుగ్రహంతో తమ యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా, జయప్రదంగా సాగుతుందనే నమ్మకం ఉందన్నారు. ​ఈ కార్యక్రమంలో గురుస్వాములు పైడికొండ, లోకేశ్, గోవింద్, భాస్కరరావులతో పాటు పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. యాత్రికులకు వీడ్కోలు పలుకుతూ పట్టణ పరిధిలోని ఎర్రవరం పొలిమేరమ్మ ఆలయం వరకు వారితో పాటు నడిచి సాగనంపారు.
Breaking News

Subscribe our Newsletter