ఏలూరు ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షులు బడేటి చంటి కితాబు.. పార్టీ ఆఫీస్ లో అంగరంగ వైభవంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు, మార్చి 29.... పేదవాడికి న్యాయం చేయాలన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి, అనేక సంక్షేమ పథకాలతో పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేసిన ఘనత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని జిల్లా పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. తొలుత స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నందు గల ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం, ఏలూరు అమీనాపేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం ఆంధ్రప్రదేశ్ కు వరం వంటిదని ప్రస్తుతించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కిలో రెండు రూపాయల బియ్యం, పేదవానికి గూడు, చేనేత ధోవతిలు వంటి వాటిని ప్రవేశపెట్టి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. అసలు తెలుగు రాష్ట్రానికి అసలైన రాజకీయం నేర్పింది ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఎన్నో సవాళ్లు అధిగమించిందంటే అందుకు కార్యకర్తల అండదండలే కారణమని ఆయన కొనియాడారు . తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీయని, పార్టీ కోసం అంకిత భావంతో కృషిచేసిన ప్రతిఒక్కరికీ తప్పకుండా న్యాయం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన రాజకీయ చతురులు పార్టీ అధినేత చంద్రబాబు అని పేర్కొన్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన పార్టీని బ్రహ్మ ముహూర్తంలో ప్రకటించడం వల్ల నేటికీ పేదలకు సేవ చేసే విషయంలో పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తోందన్నారు. ఏలూరు నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయునిగా ఎన్టీ రామారావు వారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ అధికారం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. అనంతరం టిడిపి 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ప్రతిజ్ఞను నగర పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం అందరితో చేయించారు. 44 వసంతాల ప్రత్యేక బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు కొల్లేపల్లి రాజు, పొలమరశెట్టి గోపాలకృష్ణ, డోలా పరశురామ్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాదరావు, జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, పార్టీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎమ్ ఆర్ పెదబాబు మరియు తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.