అనకాపల్లి:
ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చదరం రవిశంకర్ శనివారం అనకాపల్లిలోని శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన సంగీతం అందించిన నూతన చిత్రాలు, వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫణి', వి. సముద్ర దర్శకత్వంలో రూపొందిన 'వరదరాజు గోవింద' త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విజయవంతం కావాలని ఆయన అమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.
అదేవిధంగా, దర్శకుడు అడారి మూర్తిసాయి తన కొత్త చిత్రం 'రాహుల్ మీరా భాయ్' ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర గారితో కలిసి వీరు నూకాంబిక అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డైరెక్టర్ మారిశెట్టి శంకరావు మరియు ఆలయ సిబ్బంది, ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.