కసింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంవత్సరంలో నమోదైన రెండు ద్విచక్ర వాహనాల చోరీ కేసులను అత్యంత ప్రాధాన్యతతో తీసుకున్న జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) గారి ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడింది. దీనిలో భాగంగా అనకాపల్లి ఇన్చార్జ్ SDPO, G.R.R. మోహన్ గారు ఆద్వర్యం లో, కశింకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ స్వామి నాయుడు, ఎస్‌ఐ శ్రీ లక్ష్మణరావు, ఎస్‌ఐ శ్రీ సతీష్ గార్లు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఒక బృందాన్ని గోకవరం, రెండో బృందాన్ని రాజమండ్రి, మూడో బృందాన్ని జగ్గంపేట మరియు కోరుకొండ ప్రాంతాలకు పంపించి, విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల సమన్వయంతో కూడిన మెరుపు చర్యల ఫలితంగా దొంగతనమునకు వస్తున్న ముగ్గురు నిందితులను మరియు ఇద్దరు CICL (మైనర్ బాలురు) లను ముందస్తు సమాచారం పై అత్యంత చాకచక్యంగా కశింకోట గ్రామ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకొని, వారు ఇచ్చిన సమాచారం పై వారు దొంగలించిన మోటార్ సైకిల్ లను వారి గ్రామమైన గోకవరం మండలం డ్రైవరుల కాలనీ వద్ద దాచి ఉంచినట్లు ఇచ్చిన సమాచారం పై మొత్తం 17 ద్విచక్ర వాహనాలను (అనకాపల్లి జిల్లా కు చెందిన బైకులు- 14, విశాఖపట్నం కు చెందిన బైకు-01, విజయవాడ కు చెందిన బైకులు-02) స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంబంధిత కేసుల వివరములు సేకరించి, నిందితులను ఈరోజు గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించడం జరిగింది. ఆదేవిదంగా మైనర్ బాలురు జువెనైల్ హోమ్ కు అప్పగించడమైనది.ఈ కేసును వేగవంతంగా ఛేదించి, భారీ సంఖ్యలో చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్న కసింకోట పోలీసులైన సిఐ స్వామి నాయుడు గారు, ఎస్ఐ లు K. లక్ష్మణ రావు, B. సతీష్, పోలీస్ సిబ్బంది అయిన HC G. మధుబాబు, కానిస్టేబుల్ లు అయిన D. గోపి, G. శ్రీనివాసరావు, M.బాలకృష్ణ, M. అప్పలరాజు, B. మహేశ్వరరావు, Y. లక్ష్మణ్, M. శ్రీను, HG K.బ్రహ్మరాజు ల యొక్క పనితీరును జిల్లా SP గారు, అనకాపల్లి ఇన్చార్జ్ SDPO గారు ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో చూపిన చొరవ, నిబద్ధత, సమర్థతకు గుర్తింపుగా కసింకోట పోలీసు సిబ్బందిని ఘనంగా అభినందించి సన్మానించారు.

ముద్దాయిల వివరములు :
1) పాశంశెట్టి సాయికుమార్ @ సాయి S/o లేట్ నాగేశ్వరరావు,2) మర్రి రవితేజ S/o సూరిబాబు,3) మర్రి దుర్గ బాబు S/o పెద్దబ్బాయి
CICL (మైనర్ బాలురు) వివరములు:1) తొండ చరణ్ కుమార్ @ చరణ్ S/o పోతురాజు2) మామిడి శ్యామ్ సుధీర్ @ శ్యామ్ S/o రవి
(పై ముద్దాయిలు మరియు CICL (మైనర్ బాలురు )లు అందరూ కాకినాడ జిల్లా గోకవరం మండలం డ్రైవరుల కాలనీకు చెందినవారు)