తాకా సి వీధి స్వయంభు శ్రీ పుట్ట నూకాంబిక అమ్మవారి నెలపండుగ ప్రారంభం.
16/March/2026 21:39
Share:
అనకాపల్లి మార్చి 16 రాష్ట్రంలోనే తొలిసారిగా స్వయంబో గా పుట్ట రూపంలో వెలిసి 216 సం|| ఘన చరిత్ర కలిగిన స్థానిక తాకాసి వీధి శ్రీశ్రీశ్రీ పుట్ట నూకాంబిక అమ్మవారి గరగల మహోత్సవం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది.. ఏలూరు కు చెందిన కళాకారుల బృందం ప్రదర్శించిన కళారూపా లు అందర్నీ అలరించాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం ముందు ఏర్పాటుచేసిన కోలాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా నలుమూలల నుంచి ఉన్న తాకాసి కుటుంబీకులు చుట్టుపక్కల వీధులలో ఉన్న ప్రజలు అమ్మవారి ఆలయం సందర్శించి శ్రీ నూకంబిక అమ్మవారిని భక్తి ప్రపత్తులతో కొలిచారు. అమ్మవారి ముందున్న పుట్టపై తాము తెచ్చిన వస్త్రాలను అమ్మవారికి చూపించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ తాకాసి రాజేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తాకా సి కన్నబాబు,తాకాసి చందు,తాకాసి సూర్యారావు,తాకాసి విశ్వేశ్వరరావు,మల్కాపురం ఏఎస్ఐ నర్సింగ్ రావు,తాకాసి సత్యం దొర, తాకాసి ప్రసాద్,తాకాసి కిషోర్ తాకాసి నరేష్ కారుకుండి కన్న బాబు, అడ్డాలశ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నెలరోజుల పాటు అమ్మవారి పండుగ... అమ్మవారి కొత్త అమావాస్య పండుగ ఈనెల 15 ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు నెల రోజులు పాటు అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తాకాసి కన్నబాబు తెలిపారు.