పోలీస్ కార్యాలయంలో మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా..

పోలీస్ కార్యాలయంలో మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా..

11/August/2026 14:20    Share:   

​'హరిత ఆంధ్రప్రదేశ్'లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ 
అనకాపల్లి, ఆగస్టు 11:
హరిత ఆంధ్రప్రదేశ్' మిషన్‌లో భాగంగా అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ స్వయంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల తన బాధ్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ "మానవ మనుగడకు, ఆరోగ్యకరమైన జీవితానికి మొక్కలు అత్యంత ఆవశ్యకం. చెట్ల ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడమే కాకుండా పర్యావరణ సమతుల్యత కూడా కాపాడబడుతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక మొక్కనైనా నాటి, దానిని పూర్తి బాధ్యతతో పెంచి పెద్ద చేయాలి" అని సూచించారు.​'హరిత ఆంధ్రప్రదేశ్' లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణను ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఆయన కోరారు.​ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు గారితో పాటు డీఎస్పీ శ్రీ కె.రవికుమార్, ఏ.ఓ శ్రీ సిహెచ్.తిలక్ బాబు, సిఐలు రామకృష్ణారావు, బాల సూర్యరావు, లక్ష్మి, వెంకటనారాయణ, సతీష్, రమణయ్య, రమేష్ ఎస్సైలు ప్రసాద్, సురేష్ బాబు, అంజిబాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ లు ప్రతాప్ శేషయ్య, దేవరాజు ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు.
Breaking News

Subscribe our Newsletter