పొలం బాట కార్యక్రమంలో పొలంబడి..!!

పొలం బాట కార్యక్రమంలో పొలంబడి..!!

21/August/2026 20:17    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల పొలాల్లో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన కర్రీ రామకృష్ణ, సూరిశెట్టి నర్సింగరావు రైతుల పొలాలను ప్రదర్శన క్షేత్రాలుగా ఎంపిక చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామంలోని 25 మంది రైతుల 25 ఎకరాల్లో పొలంబడి కార్యక్రమాన్ని అమలు చేస్తూ, సాధారణ సాగు పద్ధతులకు పొలంబడి పద్ధతికి మధ్య వచ్చే వ్యత్యాసాలను రైతులకు వివరించారు. విత్తనం వేసిన దశ నుంచి పంట చేతికి అందే వరకు సరైన యాజమాన్య పద్ధతులను ఎప్పటికప్పుడు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి మోహన్రావు తెలిపారు.ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా పంటలకు వచ్చే చీడపీడలు, మిత్ర పురుగులను గుర్తించే విధానాలను రైతులకు చార్టుల రూపంలో వివరించారు. అనంతరం రైతుల పొలాల్లోనే ప్రదర్శన నిర్వహించి, పంటల యాజమాన్యంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకుడు కుమార్,  ఏ పి సి ఎన్ యఫ్ సిబ్బంది వనజ, పద్మజ తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter