రాష్ట్రంలో ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులకు విద్యాశాఖ తీపి కబురు..!!
30/April/2026 17:28
Share:
క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్ యలమంచిలి : విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని కోల్పోకుండా ఉండేందుకు వెంటనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రకటించింది. ఈ పరీక్షలను మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులే కాకుండా, ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవాలనుకునే వారికి కూడా మంచి అవకాశం కల్పించారు.అయితే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మే 1 నుంచి మే 9 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత రూ.50 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు తమ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్షల కోసం ఇప్పటి నుంచే సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యాశాఖ అధికారులు సూచించారు.