రాంబిల్లి పోలీసుల చాకచక్యంతో అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ – భారీగా బంగారం స్వాధీనం
16/May/2026 22:04
Share:
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ప్రొఫెషనల్ దొంగల ముఠాను గుర్తించి పట్టుకోవడంలో రాంబిల్లి పోలీసులు కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక పోలీస్ బృందం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి సుమారు ₹66 లక్షల విలువైన 450 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుంది.దర్యాప్తులో నిందితులు రాంబిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులతో పాటు అనకాపల్లి జిల్లా మరియు ఇతర జిల్లాల్లో జరిగిన పలు చోరీ కేసుల్లో తమ ప్రమేయాన్ని అంగీకరించారు.అరెస్ట్ చేసిన నిందితులు రొంగలి ప్రకాష్ (24), పాచిలవానిపాలెం ఈర్ల వినయ్ కుమార్ (28), విశాఖపట్నం సిరికి విజయ్ కుమార్ (27), పాచిలవానిపాలెం రాంబిల్లి సీఐ సిహెచ్. నర్సింగరావు పర్యవేక్షణలో, ఎస్సై నాగేంద్ర మరియు సిబ్బంది సాంకేతిక ఆధారాలు, ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుల కదలికలను గుర్తించి కేసు ఛేదనలో విశేష కృషి చేశారు.పోలీసుల విచారణలో నిందితులు రాంబిల్లితో పాటు యలమంచిలి, అనకాపల్లి, సబ్బవరం, ఎస్.కోట,నాదెండ్ల ప్రాంతాల్లో కూడా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు.ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను మరియు రాంబిల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.